Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడంటూ కావ్య ఛాలెంజ్.. అతను పిండప్రధానం చేయగలిగాడా!
on Mar 18, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -671 లో... రాజ్ వెళ్తున్న కార్ వెనకాలే కావ్య పరిగెత్తుకొని వెళ్తుంది. రాజ్ ఒక దగ్గర ఆగుతాడు. యామిని కార్ దిగి షాప్ కి వెళ్తుంది. కావ్య సరిగా రాజ్ దగ్గరికి వచ్చి స్పృహ కోల్పోతుంది. దాంతో రాజ్ తన కార్ లో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. తనెవరో తెలియదని డాక్టర్ కి రాజ్ చెప్తాడు. యామిని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావ్ త్వరగా రా.. నువ్వు ఇక్కడికి వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటానని యామిని అనడంతో రాజ్ బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు. కావ్య స్పృహలోకి వచ్చి రాజ్ గురించి అడగ్గా ఇప్పుడే బిల్ కట్టి వెళ్ళారని రిసెప్షన్ లో చెప్తారు.
ఆ తర్వాత రాజ్ చనిపోయాడని కావ్యకి అర్థమయ్యేలా చెప్పండి అని రుద్రాణి ఇంట్లో వాళ్ళతో అంటుంటే.. లేదు మా ఆయన బ్రతికే ఉన్నాడని కావ్య అంటుంది. ఎవరు నమ్మలేదు కదా చివరకు నా నమ్మకం నిజం అయింది. నా సంకల్పo గెలిచింది.. ఇందాక మా ఆయనని చూసానని కావ్య చెప్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నేను స్పృహ తప్పి పడిపోతే, ఆయనే నన్ను హాస్పిటల్ లో చేర్పించారని కావ్య అంటుంది. నిన్ను చూసినవాడు. ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు. ఇక పిచ్చి బాగా ముదిరింది వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ట్రీట్ మెంట్ చేపించాలి లేదంటే చాలా కష్టమని రుద్రాణి అంటుంది. కావ్య చెప్తుంటే అందరు కావ్య అయ్యో పాపం అంటు దీనంగా చూడడం తప్ప ఎవరు నమ్మరు. మా ఆయన బ్రతికే ఉన్నాడని చెప్తే ఎవరు నమ్మట్లేదు కదా ఆయనను తీసుకొని రాకుంటే నా పేరు కావ్యనే కాదని కావ్య ఛాలెంజ్ చేస్తుంది.
యామిని దగ్గరికి తన పేరెంట్స్ వస్తారు. ఏం చేస్తున్నావని వాళ్ల నాన్న అడుగగా.. రాజ్ ఐడెంటిటీ మారుస్తున్నానని యామిని అంటుంది. ఐడెంటిటీ మార్చినంత మాత్రనా రాజ్ మారుతాడా.. గతం గుర్తు వస్తే క్షమించడు అని వాళ్ళ నాన్న అంటాడు. అందుకే ఫారెన్ తీసుకొని వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నానని యామిని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ కి సుభాష్ పిండప్రధానం చేస్తుంటే.. కావ్య వచ్చి నా భర్త బ్రతికే ఉన్నాడు. తండ్రి అయినా సరే మీకు అర్హత లేదని కావ్య సుభాష్ తో అంటుంది. రాజ్ ఫోటోని కావ్య అక్కడ నుండి తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
